ETV Win New Web Series: ఈటీవీ విన్ తన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్’ అనౌన్స్‌మెంట్ చేసింది. సందీప్ రాజ్ షో రన్నర్‌గా ఉన్న ఈ సిరిస్‌కి జోసెఫ్ క్లింటన్ రైటర్, డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్ ఆదివారం పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. పరిశ్రమ నుంచి ప్రముఖులతో పాటు టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాత ఎ.ఎస్.కె.ఎన్ ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సిరీస్‌కి ఒక ఇంట్రస్టింగ్ టోన్‌ని సెట్ చేస్తుంది. ‘AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్’ ఫ్యాన్, డ్రామా అండ్ ఇంటెన్సిటీ ఉన్న సిరీస్ ని హింట్ ఇస్తోంది. హర్ష రోషన్, భాను ప్రతాప, జయతీర్థ, హర్ష చెముడు, సింధురెడ్డి తదితర నటీనటులతో ‘AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్’ ఒక థ్రిల్లింగ్ వెంచర్‌గా రూపొందుతోంది.