Good Bad Ugly
Good Bad Ugly

Good Bad Ugly: అజిత్ కుమార్ ఎలక్ర్టిఫయింగ్ సెకండ్ లుక్

Good Bad Ugly: ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో స్టార్ హీరో అజిత్ కుమార్, అధిక్ రవిచంద్రన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఎలక్ర్టిఫయింగ్ సెకండ్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ర్టీలో మైత్రీమూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో ఒకటి. స్టార్ హీరో అజిత్ కుమార్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ బ్యానర్‌పై ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నిర్మిస్తున్నారు. బైలింగ్వల్ మూవీకి అదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సెకండ్ లుక్‌ను విడుదల చేశారు. అజిత్ బ్లాక్ షేడ్స్ ధరించి ప్రిజనర్ యూనిఫామ్‌లో ఎలక్ర్టిఫయింగ్ లుక్‌లో అదరగొట్టాడు. అజిత్ చేతిపై ఉన్న టాటూ, బ్యాక్ గ్రౌండ్‌లో గన్ ఫైరింగ్ హైలైట్‌గా ఉన్నాయి. అందరినీ ఆకట్టున్న ఈ ఎలక్ర్టిఫయింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

భారతీయ చలనచిత్రాల్లో భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అభినందన్ రామానుజం డీవోపీగా పనిచేస్తుండగా విజయ్ వేలుకుట్టి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మూవీ మేకింగ్ స్పీడందుకుంది. చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి నాటికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తారాగణం: అజిత్
సాంకేతిక సిబ్బంది
రచన & దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
డీవోపీ: అభినందన్ రామానుజం
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: జిఎం శేఖర్
స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్
స్టైలిస్ట్: అను వర్ధన్ / రాజేశ్ కమర్సు
పీఆర్వో: సురేశ్ చంద్ర
పీఆర్వో (తెలుగు) : వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మార్కెటింగ్ (తమిళం) : డి-వన్
సౌండ్ డిజైన్: సురేన్
స్టిల్స్ : జి.ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్స్: ADFX స్టూడియో
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేశ్ నరసింహన్
సిఈవో: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై రవిశంకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *