Odela 2: తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సపంత్ నంది టీమ్ వర్క్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న మల్టీ లింగ్వల్ ఫిల్మ్ ‘ఓదెల 2’ కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌కు హైదరాబాద్‌లో శ్రీకారం చుట్టారు. తమన్నా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌తో కలిసి స్టైలిష్ మాస్ డైరెక్టర్ సపంత్ నంది క్రియేట్ చేసిన 2021 హిట్ ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా ‘ఓదెల-2’ మూవీని నిర్మిస్తున్నారు. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్ వర్కింగ్ వీడియోకు ప్రెక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో సీక్వెల్‌పై హైప్‌ను పెంచేశాయి. హై బడ్జెట్, మల్టీ లాంగ్వేజ్ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లో కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభించింది. సినిమాలోని పలు కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. టాప్ క్లాస్ యాక్షన్ డైరెక్టర్స్‌తో కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదనాన్ని పంచనున్నాయి. ఇన్నోవేటివ్ స్టంట్స్, బ్రీత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్‌కు గొప్ప అనుభూతి లభించనుంది.
ఈ సన్నివేశాలు పర్ఫెక్షన్, రియలిజంతో అద్భుతంగా తీర్చిదిద్దడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూమెంట్స్‌ను స్టంట్ ఎక్స్పర్ట్స్ కో-ఆర్డినేషన్ టీం చూస్తోంది. ఆడియన్స్‌కు సీట్ ఎడ్జ్ఎక్స్ పీరియన్స్ కలిగించేలా మూవీ కోసం తమన్నా ఇంటెన్స్ ట్రైనింగ్ పూర్తిచేశారు.
ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ను బ్లెండ్ చేయడం ఎబిలిటీ ఉన్న దర్శకుడు సపంత్ నంది ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో ఓదెల-2 ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్ పంపింగ్ యాక్షన్ సీన్స్ రోలర్ -కోస్టర్ రైడ్‌ను అందించడానికి సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్లు వర్క్ చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రముఖ సినిమాటో గ్రాఫర్ సౌందర్ రాజన్ డీవోపీ అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి.మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డీవోపీ: సౌందర్ రాజన్.ఎస్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
మార్కెటింగ్: ఫస్ట్ షో