Shabash Police: సకాలంలో స్పందించిన పోలీసులు రెండు నిండు ప్రాణాలను కాపాడగలిగారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి నది ఒడ్డుకు చేరుకున్న తల్లి, కూతుళ్లను బ్లూ కోట్స్ సిబ్బంది రక్షించారు. నిర్మల్ జిల్లా కొండాపూర్‌లో నివసించే మహిళ తన కూతురుతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు శుక్రవారం ఉదయం సోన్ మండలం మాదాపూర్ గోదావరి పుష్కర ఘాట్ వద్దకు వచ్చింది. మహిళ భర్త నిజామాబాద్ నుంచి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. బ్లూ కోట్స్ సిబ్బంది కానిస్టేబుల్ శేఖర్, నరోత్తం వెళ్లి ఆ మహిళను కాపాడి ఆమె తండ్రిని పిలిపించి అప్పగించారు. దీంతో నిర్మల్ పోలీస్… మీ పోలీస్ అని రుజువు చేశారు. తక్షణమే స్పందించిన బ్లూ కోట్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.