Suspension: నిర్మల్ జిల్లాలో బిట్ కాయిన్, క్రిప్టో మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కడెం మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కొండల నరేశ్, సాయికిరణ్‌లను పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా సస్పెండ్ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.