Comedian Ramesh: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం ప్రముఖ సినీ హాస్యనటుడు తాగుబోతు రమేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం ఆధ్వర్యంలో ఆయనకు సాధారణ స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ స్వామివారి శేష వస్ర్తం, ప్రసాదం చిత్రపటం అందజేసి సన్మానించారు.
ఆలయంలో భక్తుల సందడి
దేవస్థానంలో భద్రపద మాసం శుద్ధ త్రయోదశి సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వేకువజామునే క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలను దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.