Vinayaka immersion: నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక శోభాయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం వినాయక సాగర్లో గణేశ్ నిమజ్జనం నిర్వహించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష కార్యదర్శులు శంకర్, రమేశ్, కోశాధికారి నరేందర్ రెడ్డి, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.