Oath of the Market Committee Governing Body
Oath of the Market Committee Governing Body

Oath of the Market Committee Governing Body: కొలువుదీరిన మార్కెట్ కమిటీ పాలకవర్గం

Oath of the Market Committee Governing Body: ధర్మపురి, అక్టోబర్ 14 (మన బలగం): ధర్మపురి మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చిలుముల లావణ్య లక్ష్మణ్, వైస్ చైర్మన్‌గా సంగ నర్సింహులుతోపాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం అనంతరం మనం పొందాలనుకున్న ఫలాలు పొండంలో జాప్యం జరిగిందని, వాటిని తిరిగి సాధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ ప్రాంత సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముందుంటున్నారని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మార్కెట్ పాలకవర్గంపై ఉందన్నారు.

ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించాు. దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా రుణమాఫీ అమలు చేశారా అని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనే రైతు రుణమాఫీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. చేగ్యం బాధితులకు వారి పరిహారం అందించడం, గత ప్రభుత్వంలో సాధ్యం కాని నైట్ కాలేజ్‌ని తిరిగి ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్‌కే దక్కుతుందన్నారు. అనంతరం విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అరాచక పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారని, గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కొప్పుల ఈశ్వర్ కనీసం ఇక్కడి రైతుల గురించి ఆలోచించలేదని ఆరోపించారు. కటింగ్ పేరుతో రైతులను నిలువునా రైస్ మిల్లర్లు దోచుకుంటుంటే మంత్రి హోదాలో కనీసం స్పందించలేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఆ మేరకు రుణాలను మాఫీ చేసి చూపించామని తెలిపారు. జగిత్యాల జిల్లాకు సంబంధించి 80 శాతం వరకు రుణమాఫీ పూర్తి అయ్యిందన్నారు. మిగిలిన 20 శాతం రైతులకు రుణాలకు మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ ప్రాంత ఇరిగేషన్ విషయంలోనూ ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రిని కలిసి వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే పత్తిపాక రిజర్వాయర్‌ను పూర్తి చేసి రైతాంగానికి నీటిని అందిస్తామని, లిఫ్ట్‌లకు మరమ్మతులు పూర్తి చేయించి తిరిగి వాడుకలోకి తీసుకొస్తామని వెల్లడంచారు. రోళ్ల వాగు ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచినప్పటికీ దాన్ని గత ప్రభుత్వంలో పూర్తి చేయలేకపోయారని, దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *