Request to Collector: నిర్మల్, అక్టోబర్ 21 (మన బలగం): స్వతంత్ర సమరయోధులు మత సమైక్యవాది దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రెండు సార్లు కేంద్ర విద్యా శాఖ మంత్రిగా సేవలందించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ త్యాగాలను సేవలను గుర్తించి వెంటనే ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది బాధ్యతగా కలాం గుణం ఎడ్యుకేషనల్ యూత్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నవంబర్ ఒకటవ తేదీ నుంచి 11వ తేదీ వరకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి చవాలను నిర్వహిస్తూ విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస చిత్రలేఖనం పోటీలతో పాటు ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నామని ఆ సొసైటీ జిల్లా వ్యవస్థాపక ,అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు, సయ్యద్ చాంద్ పాషా, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇంతియాజ్ ,సంయుక్త కార్యదర్శి జుబేర్ ఖాన్, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మొహమ్మద్ బిన్ అలీ,శేఖ్ ఇంతియాజ్, ఉపాధ్యక్షులు సయ్యద్ అమీన్ బాబా, శేఖ్ షకీల్, ఇఫ్తే ఖార్ అన్సారి తదితరులు ఉన్నారు.