Volleyball competitions
Volleyball competitions

Volleyball competitions: ఆశ్రమ పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

Volleyball competitions: నిర్మల్, నవంబర్ 12 (మన బలగం): నిర్మల్‌లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి బి.కృష్ణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 16, 17వ తేదీల్లో మెదక్ జిల్లా చెగుంటలో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో కృష్ణ పాల్గొంటారని పాఠశాల హెడ్‌మాస్టర్ అనూష తెలిపారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి అంబాజి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనూష, పీడీ భూక్యా రమేశ్, పాఠశాల సిబ్బంది తదితరులు విద్యార్థిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *