Children's Day
Children's Day

Children’s Day: రవీంద్రలో బాలల దినోత్సవం

Children’s Day: జగిత్యాల, నవంబర్ 13 (మన బలగం): జగిత్యాల పట్టణంలోని రవీంద్ర ప్లే స్కూల్‌లో నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. బుధవారం రవీంద్ర ప్లే స్కూల్‌లో నిర్వహించిన ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలలో భాగంగా పాఠశాల నిర్వాహకులు సుమన్ రావు, కిషన్, పాఠశాల డైరెక్టర్స్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్య ప్రదర్శనలు, వివిధ దేవతల, స్వాతంత్ర్య సమరయోధులు, కార్టూన్ పక్షులు, వివిధ జంతువుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. రైతు ప్రాముఖ్యత, అమ్మ నాన్న గొప్పతనాన్ని తెలియజేస్తూ నాటికలు ప్రదర్శించారు. చిన్నారుల పాత్రలు, సంభాషణలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. వారి నటకు మంత్రముగ్దులయ్యారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బి.శ్రీధర్ రావు, బి.హరిచరణ్ రావు, జె.రాజు, జె.మౌనికలతో పాటు పోషకులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

Children's Day
Children’s Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *