Indiramma Houses
Indiramma Houses

Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్

  • ఎలాంటి అవాంతరాలు లేకుండా సర్వే సాగాలి
  • సర్వే సిబ్బందికి కలెక్టర్ సూచన

Indiramma Houses: జగిత్యాల, డిసెంబర్ 12 (మన బలగం): జగిత్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో, ఎర్దడి గ్రామంలో పాటు మెట్‌పెల్లి మండల వెంపేట్, గ్రామంలో పలు వార్డులో ఇళ్లులేని నిరుపేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా సర్వే సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు. యాప్ ద్వారా సర్వే చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ పథకం కింద పూర్తిస్థాయి అర్హత గల నిరుపేద కుటుం బాలకు ఇళ్లను అందజేసే లక్ష్యంతో సర్వే చేయాలని తెలిపారు. జిల్లాలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజపాలన దరఖాస్తు ఆధారంగా నిరుపేదను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తావని తెలిపారు. ఏర్దడి గ్రామంలో సర్వే చేసిన సరళిని పరిశీలించారు. అనంతరం లబ్ధిదారుల వివరాలను యాప్ ద్వారా పొందుపరుస్తున్న వివరాల నమోదు ల్యాండ్ డాక్యుమెండను ప్లాటును స్వయంగా పరిశీలించిన కలెక్టరు దగ్గర ఉండి వివరాలను నమోదు చేయించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ ఇఇ, రాజేశ్వర్, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *