Distribution of CM Relief Fund cheques: నిర్మల్, డిసెంబర్ 21 (మన బలగం): సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంప్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ప్రజా పాలన అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, పట్టణ అధ్యక్షులు నందెడపు చిన్ను, కౌన్సిలర్లు శనిగారపు నరేష్, సోన్, దిలావర్పూర్, మామడ, నర్సాపూర్ మండలాల అధ్యక్షులు మధుకర్ రెడ్డి, సాగర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, లక్ష్మంచంద జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, నిమ్మ సాయన్న, అరుగుల రమణ, కటకం రాజారెడ్డి, కొట్టె శేఖర్, సబా కలీం, కొంతం గణేశ్, అంగూరు మహేందర్, ఈసవేని మనోజ్, చిన్నయ్య, గుల్లే రాజన్న, మేకల నరేష్ తదితరులు పాల్గొన్నారు.