Artist Gangadhar Naik: రాయికల్, జనవరి 3 (మన బలగం): భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యం కల్చరల్ సెంటర్ నుంచి రాయికల్ మండలానికి చెందిన గంగాధర్ నాయక్ వారి యొక్క బృందానికి ఆహ్వానం పలికింది. కేరళ కోజికోడ్ సర్గాలయ ఇంటర్నేషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫెస్టివల్ 2025కు గాను తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రదర్శన ఇవ్వటానికి ఈనెల 5న 15 మంది యువతీ, యువకులకు ఆహ్వానం పలకగా, దేవరకొండ నుంచి మరియు కరీంనగర్, జగిత్యాలకు చెందిన పలువురు యువ కళాకారులను గంగాధర్ నాయక్ తీసుకెళ్లడం జరుగుతుంది. గిరిజన సాంప్రదాయమైన బంజారా నృత్యం, బతుకమ్మ, బోనాల నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నామని గంగాధర్ నాయక్ తెలిపారు. వీరి యొక్క బాధ్యులుగా జాతీయ యువజన అవార్డు గ్రహీత రేండ్ల కళింగ శేఖర్ సారధ్యంలో గంగాధర్ నాయక్ బాధ్యత వహిస్తూ వెళ్లడం జరుగుతుంది. కాగా పలువురు రాష్ట్ర ఖ్యాతిని చాటి రావాలని శుభాకాంక్షలు తెలిపారు.