Attack on young woman with surgical blade
Attack on young woman with surgical blade

Attack on young woman with surgical blade: యువతిపై సర్జికల్ బ్లేడ్‌తో దాడి

Attack on young woman with surgical blade: నిర్మల్, జనవరి 17 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం యువతిపై సర్జికల్ బ్లేడ్‌త్ దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలోని సోఫీనగర్‌లో ఉంటున్న సంతోష్ దివ్య అనే యువతి వద్ద కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తీర్చాలని పలుమార్లు సంతోష్‌ను దివ్య నిలదీసింది. డబ్బులు చెల్లించకపోగా సంతోష్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో దివ్య అప్పు విషయం అడిగేందుకు సోఫీనగర్‌లోని సంతోష్ వద్దకు వెళ్లింది. అప్పటికే కోపంతో ఉన్న సంతోష్ డబ్బులు ఇవ్వను అని తెగేసి చెప్పడంతోపాటు తన వద్ద ఉన్న సర్జికల్ బ్లేడ్‌తో దివ్య గొంతుపై ఒక్కసారిగా దాడిచేసాడు. నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన దివ్యను స్థానికులు గమనించి వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దివ్యకు దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *