MLA Power Rama Rao Patel: ముధోల్, ఫిబ్రవరి 8 (మన బలగం): అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడంతో ఆ విజయం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవినీతిపరులను ప్రజలు ఇంటికి సాగనంపుతారనడానికి ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. మూడో సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జీరోలోనే ఉందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేస్థితిలో లేరన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో దేశం సుభిక్షంగా ఉందని, ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్‌ను కోరుకున్నా రన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే ప్రజలు విసుగుచెందారని ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.