BJP celebrations: ధర్మపురి, జనవరి 8 (మన బలగం): ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఘన విజయం సాధించిన సందర్భంగా ధర్మపురి పట్టణంలో స్థానిక నంది, గాంధీ, అంబేద్కర్ చౌక్‌లో పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం, జైలుకెళ్ళిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. మైనార్టీ ఓట్లకు కక్కుర్తిపడిన కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు గుండుసున్నా స్థానాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజుభాస్కర్, మండల అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కో కన్వీనర్ బండారి లక్ష్మణ్, ఓబీసీ జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు నలుమసు వైకుంఠం, మాజీ పట్టణ అధ్యక్షులు బెజ్జరపు లవన్, స్తంభం కాడి శ్యామ్, నరెడ్ల శంకర్, తిరుమందస్ సత్యనారాయణ, దివిటి శ్రీధర్ శ్రీధర్, మండలాజి సూరజ్, కాసెట్టి హరీశ్, సోమిశెట్టి శివ సాయి, కోడిగంటి కిరణ్, వేలగందుల ప్రణీత్, బండారి గణేష్, అప్ప మల్లేష్, ముత్తినేని సత్యనారాయణ అయ్యోరి సత్యనారాయణ, కాసెట్టి రాజేష్, ఉయ్యాల వెంకటేష్, కొంపల గణేష్, నేరెడ్ల విగ్నేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.