Raquel Freezer Company: నిర్మల్, ఫిబ్రవరి 10 (మన బలగం): అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో రాక్వెల్ సంస్థ ఫ్రీజర్స్ విభాగంలో దూసుకుపోతుందని రాక్వెల్ సంస్థ హెడ్ స్ట్రాటజీ మేనేజర్ నరసింహమూర్తి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలో 9వ శాఖను రాక్వేల్ సంస్థ హెడ్ స్టాటేజీ మేనేజర్ బ్రాంచ్ స్టోర్స్ నరసింహ మూర్తి, ఫ్రాంచైజ్ యజమానులు దినకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి నరసింహ మూర్తి మాట్లాడుతూ.. కమర్షియల్ రిఫ్రిజీరేషన్ ఉత్పత్తులు, ఆధునిక అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ తయారు చేస్తున్న రాక్వేల్ ఉత్పత్తులు పారిశ్రామిక రంగంలో నూతన ఒరవడులను సృష్టిస్తుందన్నారు. ఫ్రీజింగ్ టెక్నాలజీతో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఫ్రీజర్లు, కూలర్లు, డిస్పెన్సరీలు, మిఠాయి షోకేజీలు, బార్ రిఫ్రిజిరేషన్ యూనిట్లు వంటి శీతలీకరణ యూనిట్లను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరలకే అత్యుత్తమ నాణ్యతతో అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
