Gautam students qualify for state level competitions: నిర్మల్, ఆగస్టు 12 (మన బలగం): జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం నిర్మల్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అండర్ – 13 ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో స్థానిక గౌతమ్ మోడల్ స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థులు రాథోడ్ వైష్ణవి, షేక్ గులాం అర్హన్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గౌతమ్ మోడల్ పాఠశాల విద్యాసంస్థల సీఈవో మాగ్లూరీ భరత్ కుమార్ విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ డి.రమేశ్ స్థానిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులను సత్కరించారు. విద్యార్థులు చదువుతోపాటు, ఆటల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు.