HIV testing should be encouraged: ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ఒకవేళ వ్యాధి ఉన్నట్లయితే మందులు వాడి జీవిత కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుందని ఐకేపీ డీఆర్పి మారుతి, ఏపీఎం కె.అరుణ అన్నారు. మంగళవారం నిర్మల్ గ్రామీణ ఐకేపీ కార్యాలయంలో సూర్ ఎన్జీవో, ప్రసూతి ఆస్పత్రి ఐసీటీసీ, డీఎస్ఆర్సీ సంస్థల ఆధ్వర్యంలో హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు విధిగా పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. సూర్ ఎన్జీవో పీఎం మల్లికార్జున్, డీఎస్ఆర్‌సీ కౌన్సిలర్ శ్రీనివాస్, ఐసీటీసీ కౌన్సిలర్ ఎల్లేష్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులకు అందుతున్న సేవలు, నివారణ జాగ్రత్తలపై వివరించారు. కార్యక్రమంలో ఆడిటర్ ముత్యం, సీసీలు నరసయ్య, రేఖ, జ్యోతిర్మయి, భోజన్న, సంతోష్, ఐకేపీ మహిళా ప్రతినిధులు వీవోఏలు పాల్గొన్నారు.