Kamalakot Venkateswara temple lightning strike: నిర్మల్ జిల్లా మామడ మడలం కమల్‌కోట్ వేంకటేశ్వర ఆలయం పిడుగుపాటుకు ధ్వంసం అయింది. సోమవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పాటుకు ఆలయ శిఖరం పడిపోయింది. ఆలయం చుట్టూ గోడలు దెబ్బ తిన్నాయి. గ్రామస్తులు వెంటనే ఆలయం వద్దకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు.