BJP Leaders Meet Bandi Sanjay, Call for Strength in Upcoming Local Body Elections: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన బీజేపీ నేతలు ఆదివారం కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిశారు. కరీంనగర్‌లోని మహా శక్తి దేవాలయంలో ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని, ఆ దిశగా కష్టపడాలని సూచించారు. కేంద్రం ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు నిర్మల్ జిల్లా లీగల్ సెల్ న్యాయవాది వెంకట్ రమణారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాయిని సంతోష్, మాజీ మండల ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకులు ఏనుగందుల రవి తదితరులు పాల్గొన్నారు.