Dense fog in Khanapur Telangana: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆదివారం పొగమంచు (ఫాగ్) పూర్తిగా కామ్మేసింది. ఉదయం 4 గంటల నుంచి దట్టమైన పొగమంచు రహదారులను కనబకుండా చేసింది. ఇండ్ల పైన ఈ పొగ పూర్తిగా కమ్మేయటంతో చీకటిగా మారింది. ఎటు చూసినా పొగ కప్పుకుంది. దీనితో ఉదయం ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రధాన రహదారి కనబడకుండా మొత్తం పొగ కమ్ముకుంది. ఎటుచూసినా పొగ ఉండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు. దాదాపు 7 గంటల వరకు దట్టమైన పొగ అలాగే ఉంది. ఏడు దాటిన ఇంకా చీకటిగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏడు దాటినా ప్రధాన రహదారిపైన వాహనాలకు లైట్లు వేసుకొనే నడిపారు. మొత్తానికి పొగమంచు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.

