Congress to Recognize Hardworking Leaders – KK Mahender Reddy in Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన కార్యకర్తల సమావేశం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాల నుంచి కష్టపడిన వారిని గుర్తించి వారికి స్థానిక సంస్థలలో టికెట్లను కేటాయించడం జరుగుతుందన్నారు అంతేకాకుండా ఈ ప్రభుత్వము ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులను చేశామని సంక్షేమ పథకాలను అమలుపరిచి నిరూపించామన్నారు. గతంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి సందర్భంలో సుమారు 60 వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల వరకు ఉచితవిద్యుత్ 500 రూపాయలకే సిలిండర్, ఇండ్ల మంజూరి పథకాలను కొనసాగిస్తున్నామని అన్నారు.
దేశంలోనే తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసి చూపించామని అన్నారు. రైతులకు రైతు భరోసా సన్నవడ్లకు బోనస్ వ్యవసాయ సబ్సిడీ పరికరాలు అందించి రైతులను ముందుకు నడిపిస్తున్నామని అన్నారు. మహిళలను లక్షాధికారులను చేయడమే పట్టుదలగా పెట్రోల్ బంకులు రైస్ మిల్లులు సూపర్ మార్కెట్లు వెహికల్స్ వారికి అందించి జీవన ప్రమాణాలను పెంచుతున్నామన్నారు. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ స్థానాల నుంచి ఎంపీపీలు, వార్డు మెంబర్ స్థానాల నుంచి సర్పంచుల వరకు అలాగే జడ్పీటీసీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌లు రాములు నాయక్ ఎస్.కె సాబేరాబేగం, వైస్ చైర్మన్లు గుండాటి రామ్ రెడ్డి, లక్ష్మణ్, వీర్నపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూత శ్రీనివాస్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు హరిలాల్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు చెన్ని బాబు, లింగం గౌడ్, మరి శ్రీనివాసరెడ్డి, సూడిద రాజేందర్, దేవేందర్, మేడిపల్లి దేవానంద్, బాలు యాదవ్, వెంకటేశ్ మూర్తి గంగన్, మల్లారెడ్డి, దేవేందర్ యాదవ్, చెట్పల్లి బాలయ్య, కల్లూరి బాపిరెడ్డి పాల్గొన్నారు.
