Bhaje Vaayu Vegam Review: భజే వాయువేగం మూవీలో హీరో కార్తికేయ పాత్ర పేరు వెంకట్. మంచి క్రికెటర్ కావాలని ఎన్నో కలలు కంటాడు. తాహతుకు మించి అప్పులు ఉండడంతో అమ్మానాన్నలు ఆత్మహత్య చేసుకుంటారు. తల్లిదండ్రులను కోల్పోయి కష్టాల్లో ఉన్న వెంకట్‌ను తండ్రి స్నేహితుడు లక్ష్మయ్య (తనికెళ్ల భరణి) చేరదీస్తాడు. అప్పటికే కష్టాల్లో ఉన్న కుటుంబంలోకి వెంకట్ రాకను కాదనలేకపోతారు. మరో బిడ్డ పుడితే పోషించే స్థోమత లేకున్నా వెంకట్‌ను ఎలాంటి లోటు రాకుండా పెంచి పెద్ద చేస్తారు. క్రికెటర్ అవ్వాలని కలలుకంటున్న వెంకట్‌ను నిరుత్సాహ పర్చకుండా ప్రోత్సహిస్తారు. మరోవైపు పెద్దకొడుకు (రాహుల్ టైసన్) సాఫ్ట్ వేర్ జాబ్‌పై మక్కువ పెంచుకుంటాడు. ఇద్దరికీ ట్యాలెంట్ ఉన్నా లంచావతారుల శాపానికి బలవుతారు. తాము పడుతున్న ఇబ్బందులు ఇంట్లో వారికి తెలియకుండా జాగ్రత్త పడుతారు. ఇంతలో పెద్దోడికి పెళ్లి సంబంధం చర్చలు మొదలవుతాయి. అప్పుడే కొడుకుల గురించి తెలిసి లక్ష్మయ్య షాక్‌కు గురవుతాడు. దీంతో ఆస్పత్రి పాలవుతాడు. అప్పుడే ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ మేయర్ (శరత్ లోహితస్వ) తమ్ముడు (రవిశంకర్)తో వీరికి క్లాష్ వస్తుంది. మేయర్ కొడుకు శవం, అతని తమ్ముడు కారులో లభిస్తుంది. వెంకట్‌కు దీంతో సంబంధం ఏమిటి? మేయర్ కుమారుడితో అసలు ఎందుకు విభేదాలు ఏర్పడుతాయి? దీనంతటికి ప్రధాన కారణం ఏమిటి? క్రికెటర్ అవ్వాలనుకున్న హీరో క్రికెట్ బెట్టింగుల్లోకి ఎందుకు దిగుతాడు? వెంకట్‌ను లవ్ చేసిన యువతికి, మేయర్ తమ్ముడితో ఉన్న లింక్ ఏంటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం లభించాలంటే తెరపై ‘భజే వాయువేగవం’ వీక్షించాల్సిందే.
భజే వాయువేగం టైటిల్ బేస్ హైలెవల్‌లో ఉన్నట్లుగానే ట్రైలర్ ఆ స్థాయిలోనే విడుదల చేశారు. అన్నదమ్ముల స్టోరీతో ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు రాలేదు. అందుకు తగ్గట్లుగానే కథ నేరియేషన్ డిఫరెంట్‌గా ఇంట్రెస్టింగ్‌గా సాగిపోతుంది. అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్లానే ఉండాలా అన్న కాన్సెప్ట్‌కు భిన్నంగా స్టోరీ కొనసాగుతుంది. అన్నదమ్ములు విలన్లుగా మారిన తీరు ఆసక్తికరంగా తెరకెక్కించారు. అయితే వీరికి తల్లి ఒక్కరే కాకపోయినా అన్నదమ్ములా కలిసి మెలిసి ఉండే వీరికి ఎక్కడ విభేదాలు వస్తాయి, మళ్లీ ఎలా కలుస్తారు అన్నదే ప్రధాన ఇతివృత్తం. భిన్న కథాంశాన్నే ఎంచుకున్నా తెరపై చూపడంలో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. హీరో ఎంట్రీనే పోలీసు స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. హీరో ఎంట్రీలో ప్రత్యేక చూపించినా అదే టెంపో కొనసాగించడంలో అక్కడక్కడా లోపాలు ఇట్టే తెలిసిపోతాయి. కథను అల్లడంలో, ప్రేక్షకులకు రీచ్ అయ్యే స్థాయిలో తీయడంలో పొరపాట్లు కనిపిస్తాయి. కథ సాఫీగా సాగి పోతున్న ప్రతిసారీ స్పీడ్ బ్రేకర్లు అడ్డొచ్చినట్లు అనిపిస్తుంది. స్టోరీ సాధారణమే అయినా కొత్త విషయాలు యాడ్ చేసే ప్రయత్నం చేశారు. అనుకున్న స్థాయిలో టేకింగ్ లేనట్లుగా మనకు తెలిసిపోతుంది. ఇంటర్వెల్‌కు ముందు చూపిన సస్పెన్స్‌ను రివీల్ చేయడంలోనూ అంతగా ఆసక్తిని రేకెత్తించదు. దీనిపై డైరెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో లెవల్ ఉండేది. వెంకట్‌గా కార్తికేయ నటన సూపర్బ్ అని చెప్పాలి. హ్యాపీ డేస్‌లో రాహుల్ బాడీ లాంగ్వేజ్ సెట్ అయినా ఇందులోని క్యారెక్టర్‌కు సూట్ కాలేదు. హీరో, హీరోయిన్ల మధ్య డ్యూయెట్ బెటర్‌గానే ఉన్నా కెమిస్ర్టీ అనుకున్నంత పర్ఫెక్ట్‌గా కుదరలేదు. సెట్టింగ్స్, ఇతర వాటికి భారీ స్థాయిలోనే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
తారాగణం : హీరోగా కార్తికేయ, హీరోయిన్‌గా ఐశ్వర్యమీనన్, హీరో తమ్ముడిగా రాహుల్ టైసన్, హీరో తండ్రిగా తనికెళ్ల భరణి తదితరులు నటించారు. రథన్ సంగీతాన్ని సమకూర్చారు. యూవీ కాన్సెప్ట్స్ సినిమాను తెరకెక్కించింది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించారు.