Sonakshi Sinha wedding ceremony: సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) పెళ్లి తరువాత ఆదివారం ముంబైలోని బాస్టియన్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ను నిర్వహించారు. జహీర్ ఇక్బాల్‌తో తన వివాహ రిసెప్షన్‌లో సోనాక్షి చాలా అందంగా కనిపించారు. సోనాక్షి సిన్హా ఎరుపు రంగు చీరలో మెరిసిపోయారు. రిసెప్షన్‌లో జహీర్ ఇక్బాల్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అందమైన నెక్లెస్, దానికి సరిపోయే చెవిపోగులు మరియు ఎరుపు రంగు చూడ సెట్లు ధరించారు. ఆమె జుట్టును గజ్రాతో సొగసైన బన్నులో కట్టి ఉంచారు. జహీర్ ఆఫ్-వైట్ ట్రెడిషనల్ ఫిట్‌ని ధరించాడు. సోనాక్షి బాంద్రా ఇంట్లో ప్రైవేట్ వ్యవహారంలో తమ వివాహ క్రతువు పూర్తయ్యింది. ఇద్దరూ రిజిస్టర్‌లో వివాహ ఆమోద సంతకాలు చేశారు.