Lok Adalat
Lok Adalat

Lok Adalat: రాజీ మార్గమే.. రాజమార్గం: ఎస్పీ జి.జానకి షర్మిల

జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Lok Adalat: నిర్మల్, మార్చి 3 (మన బలగం): రాజీమార్గమే రాజమార్గం అనే సూత్రాన్ని అనుసరించి వివాదాలను చక్కదిద్దుకోవడానికి జాతీయ లోక్‌అదాలత్ అద్భుతమైన అవకాశం అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రకటన ద్వారా తెలిపారు. వివాదాలు ఒకసారి ప్రారంభమైతే జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. కానీ వాటిని త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంటే, శాంతి సాధ్యమవుతుందని సూచించారు. జిల్లాలో వివిధ రకాల రాజీపడదగిన కేసుల్లో ఉన్న కక్షిదారులకు విజ్ఞప్తి చేస్తూ జిల్లా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉచిత న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ వరకు నిర్మల్ పట్టణం, ఖానాపూర్ మరియు భైంసా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు.
ఎలాంటి కేసులు రాజీ పడవచ్చు
జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణమే పరిష్కరించుకోవచ్చని ఎస్పీ పేర్కొన్న కేసులు:
1. యాక్సిడెంట్ కేసులు
2. చీటింగ్ (మోసం) కేసులు
3. కొట్టుకున్న కేసులు
4. వివాహ బంధానికి సంబంధించిన కేసులు
5. చిన్న చిన్న దొంగతనం కేసులు
6. కరోనా సమయంలో నమోదైన కేసులు
7. డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులు)
8. ఇతర రాజీపడదగిన కేసులు

కోర్టుకు ఎలా హాజరు కావాలి
1. మీకు తెలిసిన వ్యక్తులపై ఏమైనా కేసులు ఉంటే, వీటిని జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడానికి ఫిర్యాదు దారుడు మరియు నిందితుడు ఇద్దరూ కోర్టుకు హాజరుకావాలి.

2. తమ ఆధార్ కార్డు తీసుకుని, సంబంధిత కోర్ట్ లేదా నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాలి.

3. కోర్టులో హాజరైన వెంటనే, రాజీ ప్రక్రియను పూర్తి చేసి, కేసును పూర్తిగా ముగించుకునే అవకాశం ఉంటుంది.

జాతీయ లోక్ అదాలత్ ద్వారా లాభాలు

కేసుల తక్షణ పరిష్కారం సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చికాకుల నుంచి విముక్తి సంఖ్యాబద్ధ (ఫార్మల్) కోర్టు ప్రక్రియ అవసరం లేదు
1. లీగల్ ఫీజు, కోర్టు ఖర్చుల తగ్గింపు
2. సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన శాంతి సాధన మార్గం
3. ప్రతిరోజూ కోర్టుకు తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యను ఒకే రోజు పరిష్కరించుకునే అవకాశం.

జాతీయ లోక్ అదాలత్ బాధితులకు మంచి అవకాశం అని ఎస్పీ తెలియజేసారు. కేసులలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి, న్యాయం పొందాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *