బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
Kalvakuntla Vidyasagar Rao: ఇబ్రహీంపట్నం, నవంబర్ 3 (మన బలగం): ప్రజాధనాన్ని నిరుపయోగం చేయకుండా అభివృద్ధికి వాడుతామని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేయగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ స్వంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కొందరు నాయకులు వారి తండ్రి విగ్రహాన్ని ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ప్రజా ధనాన్ని ప్రజలకు ఉపయోగించాలని, అవసరమైతే సొంత నిధులతో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దోమకొండ చిన్న రాజన్న, దొంతుల తుకారం, మామిడి సురేశ్ రెడ్డి, వక్త చిన్నయ్య, మాజీ కోప్షన్ సభ్యులు ఎలేటి చిన్నారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలాల దశరథ్ రెడ్డి గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.