Minister Komati Reddy Venkata Reddy: తెలంగాణ బ్యూరో/ మన బలగం: రాష్ట్రంలో ఆర్అండ్‌బీ రోడ్ల మరమ్మతులు, హ్యామ్ రోడ్ల ఎంపికపై ఎస్ఈలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల ప్యాచ్‌వర్క్ పూర్తి చేసేందుకు.. పార్ట్ హోల్ ఫీలింగ్ మెకానైజ్డ్ మిషనరీ వాడి వేగంగా గుంతలు పూడ్చేలా పనులు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హ్యామ్ రోడ్ల ఎంపికలో ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీతోపాటు జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకొని రోడ్లను ఎంపిక చేయాలని సూచించారు. తీవ్రంగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు కారణం అవుతున్న రహదాలను మాత్రమే హ్యామ్‌లో ఎంపిక చేయాలని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రహదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రహదారులకు రిపేర్లు జరగకపోవడం వల్ల ఇప్పుడు అనేక రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు.