Children’s Day: నిర్మల్, నవంబర్ 14 (మన బలగం): వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్ ఆదర్శ్ నగర్లో భారత దేశ మెదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు పాటలు పాడి, నృత్యాలు చేసారు. పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బాలల దినోత్సవ ఆవశ్యకతను తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవి, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిదాస్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.