IMA Medical Camp: మనబలగం, రుద్రంగి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొనియాడారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎంఏ ఆద్వర్యంలో విప్‌ను సన్మానించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడారు. ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నారని వివరించారు. ప్రజలకు అందుబాటులోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.
500 మంది పేషెంట్స్‌కు సేవలు
ఈ క్యాంపులో సుమారు 500 మంది పేషెంట్స్‌కు సేవలు అందించారు. రాజన్న సిరిసిల్ల ఐఎంఏ డాక్టర్ల బృందం ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చికోటి సంతోష్ కుమార్, సెక్రటరీ డాక్టర్ అభినయ్, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ లీల శిరీష, డాక్టర్ శోభారాణి, డాక్టర్ పి తిరుపతి, డాక్టర్ ఆర్.తిరుపతి, డాక్టర్ అనిత, డాక్టర్ ఆర్.ప్రవీణ్, డాక్టర్ అనంత్ బృందం ఐఎంఎ పి.ఆర్.ఓ. భాస్కర్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. శిబిరంలో సాధారణ వైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, స్త్రీల సంబంధిత వైద్య నిపుణులు, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ వైద్య సేవలు అందించారు. ఉచిత పరీక్షలు సి.బి.పి, ఆర్.బి.ఎస్, ఈ.సి.జి. లాంటి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేసినారు.