INDIAN2: కమల్‌హాసన్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. నటనలో తనకు తానే సాటి అనేలా పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. అవినీతిపై పోరాటంతో మరోమారు మెస్మరైజ్ చేశారు. శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల గ్యాప్ తరువాత ఇండియన్ మూవీకి సీక్వెల్‌గా ఇండియన్ 2 తెరకెక్కించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. అవినీతి, లంచగొండితనం అంశాలే ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కించారు. నటనలో ఎంతటి రిస్క్ అయినా తీసుకునే కమల్ ఈ మూవీలో పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్ కనబర్చారు.
అవినీతి అంశాల చుట్టూ తిరిగే సన్నివేశాలతో శంకర్ స్టైల్‌లో ప్రారంభమవుతుంది ఇండియన్ 2. సిద్దార్థ్ సింపుల్ ఇంట్రడక్షన్ ఇస్తారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై సిద్ధార్థ్ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. మరోవైపు నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇస్తారు. ఇక ఇక్కడి నుంచి కథ తైవాన్‌కు షిఫ్ట్ అవుతుంది. మొదటి సాంగ్ టైం క్యాలెండర్ సాంగ్‌తో బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ గ్రోవర్ స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇస్తాడు.
కమల్ ఎంట్రీ కోసం ఎదుచూస్తున్న సమయంలో ఉలగనాయగన్ వస్తాడు. సేనాపతిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ మార్షల్ ఆర్ట్స్‌లో స్కిల్స్‌ను ప్రజెంట్ చేసే సన్నివేశాలు ఉంటాయి. దేశంలో పెచ్చరిల్లిపోతున్న అవినీతిపై పోరాడేందుకు సేనాపతి ఇండియాలో ల్యాండింగ్ అవుతాడు. టైటిల్ రోల్‌ను ఎలివేట్ చేసేలా తాత వస్తడే సాంగ్ ఉంటుంది. శంకర్ మార్క్ విజువల్స్‌తో గ్రాండ్‌గా సాగే ఈ సాంగ్ మూవీకే హైలెట్‌గా నిలుస్తుంది. అనంతరం సిద్దార్థ్ అండ్ గ్యాంగ్‌పై వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక బాబీ సింహా చుట్టూ తిరిగి ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలతో సెకండాఫ్ ప్రారంభమవుతుంది. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ సీన్లు యాడ్ అవుతాయి. అప్పటిదాకా ఒక మాదిరిగా సాగిన కథలో కొంచెం పెప్పర్ వేసినట్లు సీరియస్ మూడ్‌లో వెళ్తుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో కథ కీలక మలుపు తిరుగుతుంది. కమల్ హాసన్ చేజింగ్ సీక్వెన్స్, ముష్కరమూకలతో ఫైట్ సీక్వెన్స్ వన్ మ్యాన్ షోలా కనిపిస్తుంది. చిన్నపాటి ట్విస్ట్ ఇస్తూ ఊహించని విధంగా సినిమాకు ఎండ్ కార్డ్ పడుతుంది.
కమల్ హాసన్, సిద్దార్థ్ అండ్ గ్యాంగ్ సన్నివేశాలతో ఫర్వాలేదు అన్నట్లుగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయినట్లు అనిపిస్తుంది. మరికొన్ని సీన్లు మాత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. విజువల్స్ క్లీన్‌గా ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా గట్టిగా ఇచ్చి ఉంటే బాగుండేదని అభిమానులు కోరుకుంటున్నారు. కమల్ స్టన్నింగ్ పర్‌ఫార్మెన్స్‌తో వన్ మ్యాన్ ఆర్మీ షోలా సెకండాఫ్ సాగిపోతుంది. ఎప్పటిలాగే మరో బలమైన సామాజిక సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ శంకర్. కానీ ఈసారి మాత్రం ఎగ్జిక్యూషన్‌లో కొంత తడబడ్డాననే టాక్ వినిపిస్తోంది. చివరి 30 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు మాత్రం కళ్లార్పకుండా చూసేలా గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శంకర్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని నెటిన్లు ట్రోల్ చేస్తున్నారు.