Dharna of IKP porters
Dharna of IKP porters

Dharna of IKP porters: ఐకేపీ హమాలీల సమస్యలు పరిష్కరించాలి.. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు

Dharna of IKP porters: కరీంనగర్, నవంబర్14(మన బలగం): కరీంనగర్ జిల్లాలోని ఐకేపీ హమాలీ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని గురువారం జిల్లా ఐకేపీ కోఆపరేటివ్ సొసైటీ సెంటర్ హమాలీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో వడ్ల కొనుగోలు ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్ సొసైటీల ద్వారా జరుగుతోందని, ఇందులో పనిచేస్తున్న హమాలీ కార్మికులు, సాటసడెం చేస్తున్న మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ట్రాక్టర్, లారీ లోడ్ అయిన తర్వాత తాడు కట్టుట కూలి ఒక టన్నుకు రూ.60 చెల్లించాలని, పనిచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే బీమా కల్పించాలని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచి క్వింటాలకు రూ.80 చెల్లించాలని, ఐకేపీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, విశ్రాంతి గది, మెడికల్ కిడ్స్ ఏర్పాటు చేయాలని కోరారు.

పనిచేసే ప్రతి కార్మికునికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 55 సంవత్సరాల నిండిన వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని, హమాలీ కార్మికులందుకి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను పనిలోకి తీసుకోకుండా స్థానిక కార్మికులకు పని కల్పించి దళారి వ్యవస్థను రద్దు చేయాలని అన్నారు. కార్మికులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇచ్చి ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల సమ్మయ్య, జిల్లా ఐకేపీ కో-ఆపరేటివ్ సొసైటీ సెంటర్ హమాలి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నెల్లి రాజేశం, ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులు జంగం లింగయ్య, పిట్టల సమ్మయ్య, పిట్టల శ్రీనివాస్, నెల్లి రవీందర్, రాజయ్య, బోనాల బుచ్చయ్య, అంజయ్య, కత్తి రాములు, ఎల్లయ్య, భూమయ్య, బాలయ్య, చిన్న వేణి సమ్మయ్య, గొల్లపల్లి రాజయ్య, గంగుల శంభు లింగం, గంగుల ఐలయ్య మహిళా నాయకు రాళ్లు జాడి చామంతి, జాడి పద్మ, శారద, బౌతు విజయ, జిల్లాలోని అనేక కొనుగోలు కేంద్రాల నుంచి హమాలీ కార్మికులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, సివిల్ సప్లై మేనేజర్‌లకు వినతిపత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *