Sadar sammelanam Tomorrow: నిర్మల్, నవంబర్ 9 (మన బలగం): ఈనెల 10వ తేదీన హైదరాబాద్ జవహర్ నగర్‌లోని బతుకమ్మ గ్రౌండ్స్‌లో మేక లలితా యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించే సదర్ సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల్లోని యాదవ సోదరులందరూ హాజరు కావలసిందిగా డాక్టర్ ఈసవేని మనోజ్ యాదవ్ పిలుపునిచ్చారు. మొదటిసారిగా ఒక మహిళ నిర్వహించే సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క యాదవ సోదరుడిపై ఉందని భావించి తప్పకుండా భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈ సదర్ సమ్మేళనాన్ని తెలంగాణ రాష్ట్ర యాదవ సోదరులందరూ తమ తమ ఐక్యతకు ప్రతీకగా నిలపలన్నారు.