Transfers of IPS: రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. ఒకేసారి 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల, రామగుండం డీసీపీ గా ఉన్న అశోక్ కుమార్ ను జగిత్యాల ఎస్.పి. గా నియమించారు. అక్కడ ఉన్న సన్ ప్రీత్ సింగ్ ను సూర్యాపేట ఎస్పీగా, అక్కడ ఉన్న బీకే రాహుల్ హెగ్డేని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న ఎల్.సుబ్బారాయుడును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని సూచించారు. సైబరాబాద్ పరిధిలోని బాలానగర్ జోన్ డీసీపీ టి.శ్రీనివాస్ రావును జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా, అక్కడ ఉన్న ఐపీఎస్ రితిరాజ్‌ను అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ డీవీ శ్రీనివాస్ రావును కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
అక్కడున్న కె.సురేశ్ కుమార్‌ను బాలానగర్ డీసీపీగా, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి దరావత్‌ను మహబూబ్‌నగర్ ఎస్పీగా, అక్కడున్న హర్షవర్ధన్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా, కె.విశ్వజిత్‌ను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. ఎస్ఐబీ ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజేశ్‌ను శంషాబాద్ డీసీపీగా, అక్కడున్న నారాయణ రెడ్డిని వికారాబాద్ జిల్లా ఎస్పీగా, అక్కడున్న కోటి రెడ్డిని మేడ్చల్ డీసీపీగా నియమించారు. నితికా పంత్‌ను ఆదిలాబాద్‌లోని యాపాలగూడ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను నల్గొండ జిల్లా ఎస్పీగా, చందనా దీప్తిని రైల్వేస్ సికింద్రాబాద్ ఎస్పీగా, అక్కడున్న షేక్ సలీమాను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా, హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీ సాధనా రష్మి పెరుమాల్‌ను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు.
రోహిణి ప్రియదర్శిని నిజామాబాద్ డిచ్‌పల్లిలోని 7 వ బెటాలియన్ కమాండెంట్‌గా, ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజమహేంద్ర నాయక్‌ను జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోలో ఎస్పీగా ఉన్న భాస్కర్‌ను మంచిర్యాల, రామగుండం డీసీపీగా నియమించారు. ఐపీఎస్‌లు పిజేపీసీ ఛటర్జీ, ఎంఏ బారి, బి.రాం ప్రకాశ్, పి.సీతారాంలను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. వెయిటింగ్‌లో ఉన్న డాక్టర్ పాటిల్ సంగ్రామ్ సింగ్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. పి.సాయి చైతన్యను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోలో ఎస్పీగా నియమించారు.