Transfer of IAS: 20 మంది ఐఏఎస్ ఆఫీర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు వెలువరించారు. పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్ (2017)ను ఖమ్మం జిల్లాకు, మంచిర్యాల కలెక్టర్ బడావత్ సంతోష్ (2016)ను నాగర్‌కర్నూల్‌కు, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి (2015)ని కరీంగనర్‌కు బదిలీ చేశారు. నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (2016)ను కామారెడ్డికి, అక్కడ పనిచేస్తున్న జితేశ్ వి పాటిల్ (2016)ను భద్రాద్రి కొత్తగూడెంకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ట్రాన్స్‌కో జాయింట్ ఎండీ సందీప్ కుమార్ ఝా (2014)ను రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు. వికారాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్ శర్మ (2017)ను జయశంకర్ భూపాలపల్లికి బదిలీ చేశారు. హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ (2014)ను నారాయణపేట్ జిల్లాకు, అక్కడ ఉన్న కోయ శ్రీహర్ష (2018)ను పెద్దపల్లికి ట్రాన్స్‌ఫర్ చేశారు.
వరంగల్ కలెక్టర్ పి.ప్రియాంకను హన్మకొండకు, ఖమ్మం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సత్యప్రసాద్ (2018)ను జగిత్యాలకు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బి.విజేంద్ర (2006)ను మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియమించారు. నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కుమార్ దీపక్ (2018) మంచిర్యాల కలెక్టర్‌గా ప్రమోషన్ కల్పించారు. భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్‌ను వికారాబాద్ కలెక్టర్‌గా నియమించారు. వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డిని నల్లగొండకు బదిలీ చేశారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి (2018) వనపర్తి కలెక్టర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ ఉన్న తేజస్ నంద్‌లాల్ పవార్ (2018)ను సూర్యాపేట కలెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి (వ్యవసాయ, సహకార శాఖలు) సత్య శారదా దేవి (2015) వరంగల్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. జగిత్యాల అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దివాకర టీఎస్ (2017) ములుగు కలెక్టర్‌గా ప్రమోషన్ కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ (2018)ను నిర్మల్ కలెక్టర్‌గా నియమించారు.