Australia vs England, T20 World Cup 2024: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య కింగ్స్ టన్ ఓవల్ బార్బబోస్ లో భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఓమన్ పై విజయం సాధించగా.. ఇంగ్లండ్, స్కాట్లండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఒక పాయింట్‌తో ఇంగ్లండ్ గ్రూపులో నాలుగో స్థానంలో ఉంది.
గ్రూపు బిలో టాప్ 2 జట్లయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సమ ఉజ్జీవులుగా పోటీ పడుతున్నాయి. డిపెండింగ్ చాంపియన్ హోదాలో ఇంగ్లండ్ బరిలో దిగుతుండగా, ఆస్ట్రేలియా 2021 లో టీ 20 వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ఓమన్ తో జరిగిన గ్రూపు మ్యాచులో ఆస్ట్రేలియా 164 పరుగులే చేసినా, బౌలింగ్ లో రాణించి మ్యాచ్ గట్టెక్కింది. వార్నర్ 56 పరుగులు చేయగా, మార్కస్ స్టోనియిస్ 65 పరుగులతో రాణించి బౌలింగ్ లో కూడా రెండు వికెట్లు తీసి ఫామ్ లోకి వచ్చాడు.
ఇంగ్లండ్ ఫస్ట్ మ్యాచ్ స్కాట్లండ్ తో రద్దు కాగా, పాకిస్థాన్ తో సిరీస్ ను సొంతగడ్డపై గెలవడం ఇంగ్లండ్ కు అనుకూలించే విషయం. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో పిల్ సాల్ట్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్‌లతో బీభత్సంగా ఉంది. బౌలింగ్‌లో మార్క్ వుడ్ పైనే ఎక్కువగా ఆధారపడనుంది.
ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోనియిస్ తో బ్యాటింగ్‌లో దుర్బేద్యంగా కనిపిస్తున్నా.. ఈ మ్యాచ్ లో ఫేవరేట్‌గా ఇంగ్లండే కనిపిస్తోంది. మిచెల్ స్టార్క్, హెజిల్ వుడ్, బౌలింగ్‌పై ఆసీస్ ఆధారపడి ఉంది. లో స్కోరింగ్ నమోదవుతున్న వెస్టిండీస్, అమెరికా పిచ్‌లపై భీకరమైన బౌలింగ్ లైనప్ ఉన్న రెండు జట్లు ఏ మేరకు బ్యాటింగ్‌లో రాణిస్తాయో.. ఎవరూ గెలిచి ఆధిపత్యం కనబరుస్తారో మరి కొద్ది గంటల్లో తేలనుంది.