35-chinna katha kaadu: సురేశ్ ప్రొడక్షన్స్ రెండేళ్ల విరామం తరువాత క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాతో విడుదల కాబోతోంది. సురేశ్ ప్రొడక్షన్స్‌తోపాటు ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందింది. ఈ సినిమాలో నివేతా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, సిద్ధార్థ్ రాళ్లపల్లి, సృజన్ యరబోలు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నంద కిశోర్ ఈమని రైటర్, డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఈ సినిమాకు ‘35- చిన్న కథ కాదు’ అనే టైటిల్ ఆసక్తికరంగా మారింది. సింపుల్‌గానే భిన్నంగా టైటిల్‌ను ప్రజెంట్ చేశారు. ఆలయం మెట్లపై కూర్చున్న ఫ్యామిలీని క్యారికేచర్‌గా పోస్టర్‌ను రూపొందించారు. ఈ మూవీని ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని థియేటర్లలోనూ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. స్కూల్ ఎపిసోడ్స్ ప్రత్యేక ఎట్రాక్షన్‌గా క్లీన్ ఎంటర్టైన్మెంట్తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని మూవీ మేకర్స్ ధీమాగా ఉన్నారు.
పెళ్లిచూపులు, సమ్మోహనం, అంటే సుందరానికి తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించిన వివేక్ సాగర్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. ఆకాశం నీ హద్దురా, అంటే సుందరానికి, సర్ఫీరా, కుబేర తదితర మూవీస్‌కు విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన నికేత్ బొమ్మి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్‌ను యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు పనిచేస్తున్నారు. టీసీ ప్రసన్న ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
‘35-చిన్న కథకాదు’ మూవీ తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నటీనటులు : నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని
నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: టి సి ప్రసన్న
డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్ట్, అనీష్ పెంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్
లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్
లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా