Ibrahimpatnam Mandal Agricultural Market Committee: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరుగం రాజు, వైస్ చైర్మన్గా అలల వెంకటరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులుగా చిట్యాల బొమరెడ్డి, ద్యామెర శ్రీనివాస్, టిప్పిరి అశోక్, రావుల గణేశ్, బుక్య రాజేందర్, బుస రాజేశ్వర్, బదనకుర్తి భూమన్న, గుడ మంజురల నవ్య, గుమ్మల రమేశ్, ఉటురి ప్రదీప్ కుమార్, బస శ్రావణ్, డి.ప్రకాశ్, వి.లావణ్యలను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన పాలకవర్గం కొలువుదిరింది. నూతన పాలకవర్గాన్ని పలువురు శాలువా పూలమాలతో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.