Sardar Sarvai Papanna Goud 375th Jayanti Celebrations Khanapur
Sardar Sarvai Papanna Goud 375th Jayanti Celebrations Khanapur

Sardar Sarvai Papanna Goud 375th Jayanti Celebrations Khanapur: ఘనంగా సర్ధార్ సర్వయి పాపన్న గౌడ్ జయంతి

Sardar Sarvai Papanna Goud 375th Jayanti Celebrations Khanapur: నిర్మల్, ఆగస్టు 18 (మన బలగం): ఖానాపూర్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్ధార్ సర్వయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌడ సంఘ నాయకులు మాట్లాడుతూ, మొగలుల దౌర్జన్యాలకు తలవంచని మహా యోధుడు పాపన్న గౌడ్ తెలంగాణలో గోల్కొండ కోటను అధీనంలోకి తీసుకుని ప్రజల రక్షణ కోసం తొలి రాజుగా నిలిచారని తెలిపారు. మూడు దశాబ్దాల పాటు పరిపాలన సాగించి ప్రజలకు ఆశ్రయం ఇచ్చిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ల రాజేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఓల్లాల చిన్న నర్సా గౌడ్, దుర్గం వెంక గౌడ్, బుర్ర రాజారాం, కోటగిరి నర్సా గౌడ్, సిర్ర గణేష్, బండిపెల్లి రమణ, కైరం సురేష్, బుర్ర రమేష్, మర్రిపల్లి శేఖర్, రాజేశ్వర్, గడ్డం సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *