- హ్యాట్రిక్ విజయాల దూకుడుకు బ్రేక్
- 167 పరుగులు చేసిన లక్నో
- నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకున్న ఢిల్లీ
- రెండో విజయాన్ని నమోదు చేసిన క్యాపిటల్స్
IPL 2024 LSG vs DC: లక్నో సూపర్ గెయింట్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న లక్నో దూకుడు బ్రేక్ వేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఢిల్లీ లక్నో బ్యాట్స్‌మెన్స్‌ను నిలువరించగలిగింది. 167 పరుగులకు లక్నోను పరిమితం చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకున్నది.
భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పాయి క్రికెట్ స్టేడియంలో శుక్రవారం ఐపీఎల్ 26వ మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ గెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు డికాక్ 19(13), కెప్టెన్ రాహుల్ 39(13) ధాటిగా ఆడినా ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. మూడో ఓవర్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా డికాక్ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన పడిక్కల్ 3(6) తీవ్ర నిరాశ పరిచాడు. 4.2 ఓవర్లో రెండో వికెట్‌గా పడిక్కల్ ఔట్ అయ్యాడు.
7.3 ఓవర్లో స్టొయినిస్ 8(10) కుల్దీప్ బౌలింగ్‌లో ఇషాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తరువాత పూరన్ డకౌట్ అయ్యాడు. తరువాత వచ్చిన దీపక్ హుడా10(13) సైతం పెద్దగా రన్స్ చేయలేదు. వరుసగా వికెట్లు పడడంతో లక్నో రన్ రేట్ మందగించింది. స్కోరు బోర్డుపై రన్స్ చేరడం కష్టంగా మారింది. ఓపెనర్ రాహుల్ క్రీజులో ఉన్నా సరైన సహకారం లేకపోవడంతో పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఐదుగురు బ్యాట్స్మెన్లు 10, అంతకంటే తక్కువ రన్స్‌కే అవుట్ అయ్యారు. 9.3 ఓవర్లో రాహుల్ 39(22) అవుట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన ఆయుష్ బదోని ధాటిగా ఆడాడు.
దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35 బంతుల్లోనే 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్ తరువాత 11.5 ఓవర్లో దీపక్ హుడా 10(13), 12.6 ఓవర్లో కృనాల్ పాండ్యా 3(4) అవుట్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన అర్షద్ ఖాన్20(16), బదోని జోడి 73 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 7 వికెట్లు నష్టపోయి 167 రన్స్ చేయింది. బదోని, అర్షద్ జట్టును ఆదుకున్నారు. లేదంటే మరింత తక్కువ స్కోర్‌కే లక్నో పరిమితమయ్యేది. ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ 3, ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నాలుగు వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసి సునాయసంగా విజయాన్ని అందుకుంది. పృథ్విషా 32(22), జేక్ ఫ్రెసర్ 55(35), కెప్టెన్ రిషబ్ పంత్ 41(24), స్టబ్స్ 15(9), షై హోప్ 11(10) డేవిడ్ వార్నర్ 8(9) రన్స్ చేశారు. 24 పరుగుల వద్ద మొదటి వికెట్‌గా డేవిడ్ వార్నర్ వెనుదిరిగాడు. 63 పరుగుల వద్ద పృథ్విషా, 140 పరుగుల వద్ద జేక్ ఫ్రెసర్, 146 పరుగుల వద్ద పంత్ ఔట్ అయ్యారు. లక్నో బౌర్లలో బిష్నోయ్ 2, నవీన్ ఉల్ హక్, యష్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.