Girls protest against beard: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. గడ్డంలేని అబ్బాయిలు కావాలంటూ అమ్మాయిలు చేపట్టిన నిరసన ప్రదర్శన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాషన్ కోసం కొందరు యువత గడ్డం పెంచుకుంటున్నారు. అయితే ఆ గడ్డమే తమకు అడ్డు అంటూ అమ్మాయిలు నిరసన గళం వినిపించారు. గడ్డంలేని క్లీన్ షేవ్ చేసుకున్న బాయ్‌ఫ్రెండ్స్ కావాలని తమ కోరికను వ్యక్తం చేస్తూ ప్లకార్డులు చేతబట్టి రోడ్లపై ప్రదర్శన చేపట్టారు. ఇండోర్‌కు చెందిన కొందరు యువతలు గడ్డంతో ఉన్న అబ్బాయిలను చూడలేకపోతున్నామని, క్లీన్ షేవ్ చేసుకున్న వారు కావాలంటూ చేపట్టిన నిరసన ప్రదర్శన వైరల్ అయ్యింది. ‘నో క్లీన్ షేవ్.. నో లవ్’, ‘వి వాంట్ బియర్డ్ లెస్ బాయ్ ఫ్రెండ్స్’, ‘బియర్డ్ హటావో.. ప్యార్ బచావో’ ఇలా పలు రకాల ప్లకార్డులు చేతబట్టి నిరసనలో పాల్గొన్నారు. కొందరు అమ్మాయిలు కృత్రిమ గడ్డాన్ని ధరించి గడ్డంపట్ల తమ విముఖతను వ్యక్తం చేశారు. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియో పట్ల పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మా గడ్డం మా ఇష్టం’ అంటూ కొందరు అబ్బాయిలు కామెంట్ చేస్తుంటే, ‘మా గడ్డం మీకే అడ్డం’ అని ఇంకొందరు అంటున్నారు.