Allola visited area Hospital: నిర్మల్, అక్టోబర్ 21 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వీరితోపాటు అల్లోల మురళీధర్ రెడ్డి, మేడారం ప్రదీప్ నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్, వెంకటరాంరెడ్డి,శ్రీకాంత్ యాదవ్ తదితరులు ఉన్నారు.