Woman dies in monkey attack: నిర్మల్, అక్టోబర్ 21 (మన బలగం): కోతులు తరమడంతో కిందపడి మహిళ మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బొంగోని లక్ష్మీ (52) సోమవారం ఇంటి ముందు కూర్చున్న సమయంలో కోతులు తరమడంతో కిందపడి లక్ష్మి కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.పట్టణంలో కోతుల బెడదను అరికట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.