Digambar Mashetti War passed away
Digambar Mashetti War passed away

Digambar Mashetti War passed away: మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ అస్తమయం

  • అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి
  • డీసీసీ అధ్యక్షునితోపాటు పలు పదవులు చేపట్టిన మాశెట్టి వార్
  • దివంగత మాజీ మంత్రి గడ్డెన్నతో విడదీయారని బంధం
  • తల్లి పేరిట సరస్వతీ శిశు మందిర్, సుభద్ర వాటిక స్థలం ఇచ్చింది ఆయనే

Digambar Mashetti War passed away: నిర్మల్, అక్టోబర్ 26 (మన బలగం): మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ మా శెట్టి వార్ నిన్న రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. 1981 నుంచి 1992 వరకు 10 సంవత్సరాల పాటు భైంసా మున్సిపల్ చైర్మన్‌గా పని చేశారు. దివంగత మాజీ మంత్రి గడ్డెన్నకు అత్యంత సన్నిహితుడు. ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షునిగా కొనసాగారు. గడ్డెన్న ఎమ్మెల్యేగా ఉన్నంత సేపు దిగంబర్ మాశెట్టివార్ జిన్నింగ్ ఇండస్ట్రీయే ఆయన కార్యాలయం. కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ సనాతన ధర్మం కోసం ఎంతో పని చేసారు. సరస్వతి శిశుమందిరాల అభివృద్ధికి పాటు పడ్డారు. తన తల్లి పేరిట కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని సరస్వతి శిశుమందిర్, సుభద్ర వాటికకు ఇచ్చిన మహోన్నత వ్యక్తి. చెరువు కట్ట శివాలయంతో పాటు భైంసాలో పలు ఆలయాల అభివృద్ధికి కృషి చేశారు. అందరితో కలివిడిగా ఉంటూ భైంసాకు పెద్దన్నలా కొనసాగారు. 91 సంవత్సరాల వయస్సులో ఆయన కన్నుముశారు. ఈ సందర్భంగా పలువురు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *