Ganga Reddy met Narayan Rao Patel: ముధోల్, అక్టోబర్ 29 (మన బలగం): ముధోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్‌ను కాంగ్రెస్ పార్టీ ముధోల్ మండల అధ్యక్షులు గంగా రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు గంగారెడ్డి మాట్లాడుతూ నిజమైన కార్యకర్తలకు పార్టీ పదవుల దక్కి న్యాయం జరగాలని, ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలన్నీ ప్రతి నిరుపేద కుటుంబానికి చెందాలని వేడుకున్నట్లు తెలపారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి భోస్లే నారాయణ్ రావు పటేల్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ప్రజా సేవ చేయాలని కోరుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుంటాల బోజరం పటేల్, మాజీ ఎంపీపీ తానూర్ చంద్రకాంత్, మాజీ ఎంపీటీసీ మధు పటేల్, చకటి దేవన్న, ఓం ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.