Diwali celebrations: నిర్మల్, అక్టోబర్ 30 (మన బలగం): వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్లో ముందస్తు దీపావళి వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంతో పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ దీపావళి అని, పిల్లలతో పాటు పెద్దలు ఉత్సాగా జరుపుకునే వేడుక అని, మనలో చీకట్లను తరిమివేసే దీపతోరణమే దీపావళి అని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, కరెస్పాండంట్ గొల్లపల్లి మాధవి, పాఠశాల అకాడమిక్ డెరెక్టర్ దేవీదాస్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.