Maulana Azad Jayanti: నిర్మల్, నవంబర్ 6 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని శేక్ సహాబ్ పేటలో స్వాతంత్ర సమరయోధులు దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వారోత్సవాలలో భాగంగా కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ బోధనాలను ప్రతి ఒక్కరు అనుసరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక భూమిక పోషించిన మౌలానా అబుల్ కలాం ఆజా దేశ తొలి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా తనదైన రీతిలో సేవలందించి విద్య సాంకేతిక పరమైన అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సయ్యద్ అబ్రార్ రుల్ హసన్, మాజీ కౌన్సిలర్ శేఖ్ షాకీర్, సయ్యద్ మజహర్ ఓద్దీన్, మహమ్మద్ సర్దార్, సొసైటీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ బిన్ అలీ, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ మసూద్ ఖాన్, పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు శేఖ్ షకిల్, మహమ్మద్ జుబేర్ హుస్సేన్ ఖాన్, తదితరులు ఉన్నారు.