Anushka Shetty
Anushka Shetty

Anushka Shetty: జేజమ్మ బర్త్‌ డే స్పెషల్ స్టోరీ

Anushka Shetty: అందం అభినయం కలగలిపిన ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. తన నటనతో పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నది. బెంగళూరుకు చెందిన ఈ భామ తెలుగునాట ఓ వెలుగు వెలుగుతోంది. సూపర్‌ మూవీతో తెరంగేట్రం చేసిన అనుష్క విభిన్న పాత్రలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2005లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అదే సంవత్సరం సూపర్‌తోపాటు మహానందిలో నటించారు. ఆ తరువాత 2006లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. ఈ మూవీ తరువాత అనుష్క తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే సంవత్సరం సురేశ్ కృష్ణ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన అస్ర్తం, తమిళంలో వచ్చిన రెండు, మురుగుదాస్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ (స్పెషల్ సాంగ్)లో నటించారు.
2007లో శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన లక్ష్యం, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన డాన్‌లో హీరోయిన్‌గా నటించారు. 2008లో స్వాగతం, బాలాదూర్, శౌర్యం, చింతకాయల రవి, కింగ్ (గెస్ట్ రోల్)లో నటించారు. 2009లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి, మెహర్ రమేశ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా విడుదలైన బిల్లాలో నటించారు. ఈ రెండు సినిమాలు నటనలో అనుష్కను మరో స్థాయిలో నిలబెట్టాయి. లేడీ ఓరియంటెడ్‌గా విడుదలైన అరుంధతి మూవీ అనుష్క కెరీర్‌కు బాగా ప్లస్ అయ్యింది. ఈ మూవీలో జేజమ్మ పాత్రకు ప్రాణం పోసారు. అదే సంవత్సరం తమిళంలో వెటకారన్‌లో నటించారు.
2010లో కేడీ, యముడు, (సింగం- తమిళం), వేదం, పంచాక్షరి, ఖలేజా, తకిటతకిట(అతిథి పాత్ర), నాగవల్లి, రగడలో నటించారు. 2011లో వానం (తమిళం), దైవతిరుమగళ్ (తమిళం) విడుదలయ్యాయి. 2012లో తాండవం (తమిళం), ఢమరుకం, శకుని (తమిళం – గెస్ట్ రోల్)లో నటించారు. 2013లో అలక్స్ పాండియన్ తమిళం, ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి, బృందావనంలో నందకుమారుడు, సింగం-2 (తమిళం)లో వర్ణ (ఇరణ్డాం ఉలగం)లో నటించారు. 2014లో రజనీకాంత్ హీరోగా విడుదలైన లింగలో హీరోయిన్‌గా నటించారు. 2015లో ఎంతవాడుగనీ (ఎన్నై అరిందాల్), బాహుబలి ది బిగినింగ్, రుద్రమదేవి, సైజ్ జీరో‌లో నటించారు.
ప్రభాస్ సరసన బాహుబలిలో నటించిన అనుష్క పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించింది. 2016లో ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనాలో నటించారు. 2017లో సింగం -3, ఓం నమో వేంకటేశాయ, బాహుబలి ద కంక్లూజన్‌లో నటించారు. 2018లో భాగమతి, 2019లో సైరా నరసింహారెడ్డి, 2020లో నిశ్వబ్ధం, 2023లో మిస్ శెట్టి మిస్టర పోలిశెట్టిలో నటించారు. అరుంధతిలో జేజమ్మ పాత్రకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. వేదం సినిమాలో సరోజా పాత్రకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టరెస్ అవార్డు కైవసం చేసుకున్నారు. నాగవల్లిలో చంద్రముఖి పాత్రకు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.

బర్త్‌డే స్పెషల్‌గా ఘాటి పోస్టర్ రిలీజ్

తాజాగా అనుష్క ఘాటి చిత్రంలో నటిస్తోంది. ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. నవంబర్ 7 అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. సిగార్ కాలుస్తూ ముఖంపై రక్తంతో భీకరంగా ఉన్న ఫొటోలో అనుష్క వైలెంట్‌గా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో విస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వేదం తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *