Basara IIIT: ముధోల్, నవంబర్ 13 (మన బలగం): జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల బుధవారం బాసర ఐఐఐటీని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ, క్యాంపస్‌లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్నదని తెలిపారు. విద్యార్థులు మిడ్ టర్మ్ పరీక్షలకు హాజరయ్యారని, ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, స్థానిక అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకుండా, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఎస్పీతో పాటు, అవినాష్ కుమార్ ఐపీఎస్, ఏఎస్పీ భైంసా, మల్లేష్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.